NTV Telugu Site icon

BANK: HDFC ఖాతాదారులకు గమనిక.. ఆ రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం..!

Hdfc

Hdfc

HDFC ఖాతాదారులకు గమనిక.. రేపు (జూన్ 4), జూన్ 10, 18 మూడు రోజుల పాటు సర్వీసులకు అంతరాయం కలగనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. డబ్బులు డ్రా, విత్ డ్రా కోసమైనా.. బ్యాంక్ అకౌంట్ లో ఏవైనా సమస్యలు ఉన్న.. ఏదైనా లోన్స్ కోసం గానీ బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తుంటాం. అంతేకాకుండా టెక్నాలజీ అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని బ్యాంకింగ్ రంగం కూడా తమ టెక్నాలజీని పెంచింది.

Read Also: Delhi Crime: యువతి అందుకు ఒప్పుకోలేదని.. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

అంతకుముందు బ్యాంకులో అవసరముంటే బ్యాంకుకే వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది.. ఏముంది మన స్మార్ట్ ఫోన్ లో నైనా సేవలను కొనసాగించేలా బ్యాంకింగ్ రంగం అప్ డేట్ చేసింది. ఇంటర్నెంట్ ఉంటే బ్యాంకుకు సంబంధించి ఏ సేవలనైనా వినియోగించుకోవచ్చు. దీని వల్ల బ్యాంకుకు వెళ్లకుండా పనులు సాఫీగా ఇంట్లోనే అయిపోతాయి. ఇదిలా ఉంచితే.. హెచ్‌డీఎఫ్‌సీ తన వినియోగదారులకు కీలక సమాచారం అందించింది. సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నందున ఈ నెల(జూన్)లో మూడు రోజుల పాటు పలు బ్యాంకింగ్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఇందు కోసం తమ వినియోగదారులు సహకరించాలని బ్యాంకు కోరింది.

Read Also: Manchu Vishnu: వెన్నెల కిషోర్ కు అమ్మాయిల పిచ్చి.. వాళ్ళ కాలనీలో అమ్మాయిలు

జూన్‌ 4న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అంతరాయం కలగనుంది. అలాగే జూన్‌ 10న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు.. జూన్‌ 18న ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అంతరాయం కలుగనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. సిస్టమ్‌ అప్‌గ్రేట్‌ కారణంగా పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడనుంది. అకౌంట్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం, డిపాజిట్‌, డబ్బులు ట్రాన్ఫఫర్‌ చేయడం, ఇతర లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుందని పేర్కొంది.