NTV Telugu Site icon

H. D. Deve Gowda: ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై స్పందించన హెచ్ డీ దేవేగౌడ.. ఏమన్నారంటే?

H. D. Deve Gowda

H. D. Deve Gowda

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం సంచలనంగా మారింది. పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన టేపులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 2700 వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లాడు. తాజాగా ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఎట్టకేలకు స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ నేరం చేసినట్లుగా రుజువైతే అతనిపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, తన కుమారుడు, జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపులు, మహిళ కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులు క్రియేట్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయాలపై విచారణ జరుగుతున్నందున తదుపరి వ్యాఖ్యలు చేయడానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు.

READ MORE: Rohit Sharma: తర్వాత ఏంటి? అని అడిగితే.. రోహిత్ ఊహించని సమాధానం చెప్పాడు!

ఈ లైంగిక వేధింపుల కేసులో చాలా మంది ఉన్నారు. నేను ఎవరి పేర్లను తీసుకోకూడదనుకుంటున్నాను, ఈ విషయంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి గతంలో పేర్కొన్నారు. వారందరికీ, బాధిత మహిళలకు న్యాయం, పరిహారం అందాలని ఆశించారు. దోషిగా తేలితే ఎవరినీ విడిచిపెట్టకూడదని దేవెగౌడ అన్నారు. శనివారం 92 వ ఏట అడుగుపెట్టిన మాజీ ప్రధాని దేవెగౌడ తన పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా వారి శుభాకాంక్షలు తనకు అందుతాయిని అన్నారు. 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయాడు. అతన్ని వెనక్కి తీసుకురావడానికి ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ కేసుపై చాలా రోజుల తర్వాత దేవేగౌడ ఈ వ్యాఖ్యలు చేశారు.