Site icon NTV Telugu

HCA: తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని.. ఉప్పల్ స్టేడియంలో కొడుకు హంగామా

Hca

Hca

తండ్రుల అధికారాన్ని అడ్డంపెట్టుకుని కొడుకులు అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలు ఇదివరకు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిలో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ స‌భ్యుడు సునీల్‌ అగర్వాల్ కొడుకు హంగామా చేశాడు. ఉప్పల్ స్టేడియంలో సునీల్ కొడుకు ఖుష్‌ అగర్వాల్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. క్రికెటర్‌లతో ఫొటోలు.. ఏకంగా తండ్రి చైర్‌లోనే కూర్చుని స్టేడియంలో స‌మావేశాలు.. గేట్ దగ్గర నుంచి వీఐపీ ట్రీట్‌మెంట్‌.. స్టేడియంలోని ప‌లు ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ హల్ చల్ చేశాడు.

Also Read:Transgender Marriage: నేను ఆ హిజ్రానే పెళ్లి చేసుకుంటా.. లేకపోతే రైలు కింద పడి సచ్చిపోతా..

స్నేహితులతో కలిసి ఉప్పల్‌ స్టేడియంలోకి వచ్చి ఏకంగా హెచ్‌సీఏ కౌన్సిల‌ర్ కార్యాల‌యంలోని తండ్రి కుర్చీలోనే కూర్చుని రీల్స్‌ చేశాడు. హెచ్‌సీఏ అండర్‌-19 జట్టుకు కూడా ఖుష్ అగర్వాల్ ఎంపికయ్యాడు. గ‌తంలో ప‌ర‌స్పర విరుద్ధ ప్రయోజనాల కింద వీరిపై ఎథిక్స్‌, అంబుడ్స్‌మన్‌కు కొంద‌రు ఫిర్యాదులు చేశారు. తాజాగా ఉప్పల్‌ స్టేడియంలో ఖుష్‌ అగర్వాల్ సోషల్‌ మీడియాలో రీల్స్ తో హంగామా చేయ‌డంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version