Site icon NTV Telugu

Air India: ఎయిర్ ఇండియా కొత్త డిజైన్ చేసిన విమానాన్ని చూశారా? ఫస్ట్ లుక్ అదుర్స్ ?

Air India

Air India

Air India: ఎయిర్ ఇండియా విమానం టాటా గ్రూప్ లో విలీనం అయిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా అనగానే మనకో రూపం కళ్లముందు కదలాడుతుంటుంది. ఇకపై ఆ రూపాన్ని మర్చిపోవాల్సిన టైం వచ్చింది. ఎయిర్ ఇండియా డిజైన్ ని పూర్తిగా మార్చేశారు. దాని సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలను, లోగోలను ఆ సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. కొత్త లోగోతో కలిగిన A350 విమానాలు త్వరలో ప్రయాణికుల్ని చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.

ఎయిర్ ఇండియా 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. దాని మొత్తం విమానాలను అప్‌గ్రేడ్ చేయడానికి దాదాపు రూ. 3320 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో విమానాల ఇంటీరియర్‌లో మార్పులు చేయడంతోపాటు ఎక్ట్సీరియర్‌కు కొత్త లుక్‌ను అందించనుంది. దీనితో పాటు విస్తారా విమానాలను కూడా ఎయిర్ ఇండియా రంగులలో తయారు చేస్తున్నారు. ఎందుకంటే రెండు కంపెనీల విలీనం త్వరలో జరగబోతోంది.

Read Also:Afghanistan Earthquake: ఆఫ్ఘాన్ భూకంపంలో 1000కి పైగా మృతుల సంఖ్య

ఎయిర్ ఇండియా కొత్త లోగో ‘ది విస్టా’ ప్రత్యేకం
ఎయిర్ ఇండియా కొత్త లోగో, ‘ది విస్టా’ గురించి టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. “మీరు చూస్తున్న లోగో అపరిమిత అవకాశాలను, పురోగతిని, విశ్వాసాన్ని సూచిస్తుందన్నారు. మానవ వనరుల అంశాలను అప్‌గ్రేడ్ చేయడంపై తాము దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఇందుకు తగినట్లు ఎక్కువ సంఖ్యలో విమానాలను ఆర్డర్ చేశాం. మరింత అభివృద్ధి దిశలో పయనిస్తాం” అని అన్నారు.

Read Also:Bigg Boss 7 Telugu: సందీప్ ఆట కట్టించిన నాగ్.. ఈసారి డబుల్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చిన నాగ్…

Exit mobile version