NTV Telugu Site icon

Hathras Case: హత్రాస్ ఘటనలో ‘భోలే బాబా’ అరెస్ట్ అవుతారా..? ఐజీ సమాధానం ఇదే..!

Hatras

Hatras

Hathras Case: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో సత్సంగ్ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసిన అనంతరం ఐజీ శలభ్ మాథుర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో భోలే బాబాపై కేసు, అరెస్టుకు సంబంధించి మీడియా ప్రశ్నలు అడగగా.. ఐజీ మాట్లాడుతూ.. ఏడీజే జోన్‌ స్థాయి నుంచి అన్ని జిల్లాల్లో ఎస్‌ఓజీ టీంలను ఏర్పాటు చేశామన్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ బృందం పని చేస్తుందన్నారు. అన్ని జిల్లాల ఎస్‌ఓజీ బృందాలను ఎస్పీ హత్రాస్‌కు రేంజ్ స్థాయిలో జత చేశామన్నారు.

Read Also: Manas: పెళ్ళైన ఏడాది లోపే గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ మానస్

కాగా, భోలే బాబా బ్యాక్ గ్రౌండ్ ఏంటి, ఆయనపై ఎన్ని కేసులు నమోదయ్యాయని ఐజీని మీడియా ప్రశ్నించింది. అయితే, బాబాపై కేసు నమోదు చేసినట్లు ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. మిగతా సమాచారం సేకరిస్తున్నామన్నారు.. అలాగే, మానవ్ మిలన్ సద్భావన సమాగమ్ కమిటీకి చెందిన సేవాదర్ నుంచి కార్యక్రమానికి అనుమతి ఎప్పుడు తీసుకున్నారనే దానికి కూడా ఐజీ సమాధానం ఇస్తూ.. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది అని తెలిపారు. న్యాయ విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశాం.. విచారణలో తేలిన వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. 80 వేల మందికి అనుమతి ఇచ్చిన తర్వాత కూడా భద్రతా ఏర్పాట్లపై సత్సంగ్ నిర్వాహకులు స్వయంగా భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తారని చెప్పారు. కార్యక్రమానికి అనుమతి పొందిన వ్యక్తుల సంస్థ అధినేత ఎవరన్న ప్రశ్నకు ఐజీ సమాధానం చెప్పలేదు.