Arikomban : రేషన్ షాపుకు వెళ్లిన ఏనుగు.. బియ్యం లేవన్న కోపంతో ఏంచేసిందంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arikomban :కేరళలోని ఇడుక్కి జిల్లాలోని సంతన్‌పర ప్రాంత ప్రజలకు ఈ ఏనుగు కొంతకాలంగా తలనొప్పిగా మారింది. బియ్యాన్ని ఇష్టపడే ఏనుగు బీభత్సం సృష్టించిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ ఏనుగు తనకు ఇష్టమైన బియ్యాన్ని వెతుక్కుంటూ శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని ఓ ఎస్టేట్‌లో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లింది. అక్కడ బియ్యం కనిపించకపోవడంతో ధ్వంసం చేసింది. ఈ మేరకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బియ్యం (అరి) తినడాన్ని ఇష్టపడడం కారణంగా ఏనుగును స్థానికులు ‘అరికొంబన్’ అని పిలుస్తారు. స్థానిక భాషలో ‘అరి’ అంటే బియ్యం.. ‘కొంబన్’ అంటే ఏనుగు.
Read Also: Chittah Reintroduction Project : మరో 12చిరుతలొస్తున్నాయ్..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
అయితే ఈ రేషన్ దుకాణం ఏనుగుల సంప్రదాయ మార్గంలో ఉందని వన్యప్రాణి అధికారులు తెలిపారు. అదే ఏనుగు రేషన్ షాపుపై దాడి చేసిందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. పన్నీర్ ఎస్టేట్‌లోని రేషన్ షాపుపై గత 10 రోజుల్లో నాలుగుసార్లు ఏనుగు దాడి చేసిందని, అయితే శుక్రవారం తెల్లవారుజామున దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని దుకాణ యజమాని ఆంటోని తెలిపారు.
Read Also: Meat Ban: ఎయిర్ పోర్టుకు 10కి.మీ పరిధిలో మాంసం విక్రయాలు బంద్
రేషన్ దుకాణంలో ఉంచిన బియ్యం, ఇతర వస్తువులను ఏనుగు తినేస్తోందని దుకాణదారు తెలిపారు. ఈసారి దాడి జరుగుతుందని ముందే ఊహించి షాపులోని వస్తువులన్నీ వేరే గదిలోకి మార్చినట్లు తెలిపారు. ఏనుగుకు దుకాణంలో తినడానికి ఏమీ దొరక్కపోవడంతో దుకాణాన్ని ధ్వంసం చేసిందని ఆంటోనీ తెలిపారు. ఏనుగు తరచూ చిన్న చిన్న దుకాణాలపై దాడి చేస్తుందని, ఇనుప తాళాలు పగుల గొట్టి మరీ బియ్యం తింటుందని తెలిపారు. దీని కోసం ఏనుగు తన తొండాన్ని వాడుతుందని వారు తెలిపారు. బియ్యంతో పాటు పంచదార, గోధుమలు కూడా ఏనుగులకు ఇష్టమైన ఆహారమని ఆంటోనీ చెప్పారు.
Read Also: Teddy Love : విచిత్రమైన ప్రేమకథ.. భర్త పోయాక పదేళ్లుగా అన్నీ టెడ్డీ బేర్‌తోనే..
‘అరికొంబన్’తో పాటు మరో రెండు ఏనుగులు ఈ ప్రాంతంలోని దుకాణాలపై కూడా దాడి చేస్తున్నాయని, వీటిని స్థానికులు ‘చక్కకొంబన్’, ‘మురళీవలన్’ అని పిలుస్తారని ఆయన వివరించారు. ఏనుగులు దుకాణాలపై ఎందుకు దాడి చేస్తాయి? దీనిపై పుణ్యవేల్ అనే గ్రామస్థుడు స్పందిస్తూ.. ఈ జంతువులు బియ్యం రుచి మరిగాయని వాటిని వెతుక్కుంటూ తరచూ వస్తుంటాయని తెలిపారు. ఇటీవలే మరో ఏనుగు దాడికి గురైన చొక్కనాడ్ ఎస్టేట్‌లో పుణ్యవేల్ రేషన్ దుకాణం ఉంది. రెండేళ్లుగా పాలక్కాడ్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ‘పాలక్కాడ్ ఏనుగు-7’ లాంటి ఈ ఏనుగులను పట్టుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆయన అన్నారు. పాలక్కాడ్ ఏనుగు-7 గత ఆదివారం పట్టుబడింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!