NTV Telugu Site icon

Arikomban : రేషన్ షాపుకు వెళ్లిన ఏనుగు.. బియ్యం లేవన్న కోపంతో ఏంచేసిందంటే

Elephant

Elephant

Arikomban :కేరళలోని ఇడుక్కి జిల్లాలోని సంతన్‌పర ప్రాంత ప్రజలకు ఈ ఏనుగు కొంతకాలంగా తలనొప్పిగా మారింది. బియ్యాన్ని ఇష్టపడే ఏనుగు బీభత్సం సృష్టించిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ ఏనుగు తనకు ఇష్టమైన బియ్యాన్ని వెతుక్కుంటూ శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని ఓ ఎస్టేట్‌లో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్లింది. అక్కడ బియ్యం కనిపించకపోవడంతో ధ్వంసం చేసింది. ఈ మేరకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బియ్యం (అరి) తినడాన్ని ఇష్టపడడం కారణంగా ఏనుగును స్థానికులు ‘అరికొంబన్’ అని పిలుస్తారు. స్థానిక భాషలో ‘అరి’ అంటే బియ్యం.. ‘కొంబన్’ అంటే ఏనుగు.

Read Also: Chittah Reintroduction Project : మరో 12చిరుతలొస్తున్నాయ్..

అయితే ఈ రేషన్ దుకాణం ఏనుగుల సంప్రదాయ మార్గంలో ఉందని వన్యప్రాణి అధికారులు తెలిపారు. అదే ఏనుగు రేషన్ షాపుపై దాడి చేసిందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. పన్నీర్‌ ఎస్టేట్‌లోని రేషన్‌ షాపుపై గత 10 రోజుల్లో నాలుగుసార్లు ఏనుగు దాడి చేసిందని, అయితే శుక్రవారం తెల్లవారుజామున దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని దుకాణ యజమాని ఆంటోని తెలిపారు.

Read Also: Meat Ban: ఎయిర్ పోర్టుకు 10కి.మీ పరిధిలో మాంసం విక్రయాలు బంద్

రేషన్ దుకాణంలో ఉంచిన బియ్యం, ఇతర వస్తువులను ఏనుగు తినేస్తోందని దుకాణదారు తెలిపారు. ఈసారి దాడి జరుగుతుందని ముందే ఊహించి షాపులోని వస్తువులన్నీ వేరే గదిలోకి మార్చినట్లు తెలిపారు. ఏనుగుకు దుకాణంలో తినడానికి ఏమీ దొరక్కపోవడంతో దుకాణాన్ని ధ్వంసం చేసిందని ఆంటోనీ తెలిపారు. ఏనుగు తరచూ చిన్న చిన్న దుకాణాలపై దాడి చేస్తుందని, ఇనుప తాళాలు పగుల గొట్టి మరీ బియ్యం తింటుందని తెలిపారు. దీని కోసం ఏనుగు తన తొండాన్ని వాడుతుందని వారు తెలిపారు. బియ్యంతో పాటు పంచదార, గోధుమలు కూడా ఏనుగులకు ఇష్టమైన ఆహారమని ఆంటోనీ చెప్పారు.

Read Also: Teddy Love : విచిత్రమైన ప్రేమకథ.. భర్త పోయాక పదేళ్లుగా అన్నీ టెడ్డీ బేర్‌తోనే..

‘అరికొంబన్’తో పాటు మరో రెండు ఏనుగులు ఈ ప్రాంతంలోని దుకాణాలపై కూడా దాడి చేస్తున్నాయని, వీటిని స్థానికులు ‘చక్కకొంబన్’, ‘మురళీవలన్’ అని పిలుస్తారని ఆయన వివరించారు. ఏనుగులు దుకాణాలపై ఎందుకు దాడి చేస్తాయి? దీనిపై పుణ్యవేల్ అనే గ్రామస్థుడు స్పందిస్తూ.. ఈ జంతువులు బియ్యం రుచి మరిగాయని వాటిని వెతుక్కుంటూ తరచూ వస్తుంటాయని తెలిపారు. ఇటీవలే మరో ఏనుగు దాడికి గురైన చొక్కనాడ్ ఎస్టేట్‌లో పుణ్యవేల్ రేషన్ దుకాణం ఉంది. రెండేళ్లుగా పాలక్కాడ్ జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ‘పాలక్కాడ్ ఏనుగు-7’ లాంటి ఈ ఏనుగులను పట్టుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆయన అన్నారు. పాలక్కాడ్ ఏనుగు-7 గత ఆదివారం పట్టుబడింది.