మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన నేరస్థుడు సోను మట్కాను హతమార్చింది ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం. సోనూ మట్కా హషీం బాబా ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. అతనిపై రూ.50,000 రివార్డు కూడా ఉంది. అయితే.. దీపావళి రోజు రాత్రి షహదారాలో మామ, మేనల్లుడి జంట హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కోసం.. ఢిల్లీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో.. మీరట్ జిల్లాలోని టిపి నగర్ పోలీస్ స్టేషన్‌లో అతన్ని గుర్తించి.. పట్టుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు కాల్పులు జరిపాడు. దీంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో.. సోను మట్కా గాయపడగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా టీపీ నగర్ ప్రాంతంలో తలదాచుకున్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం గుర్తించింది. ఈ క్రమంలో.. పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో యూపీ ఎస్టీఎఫ్ సహాయం కూడా తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇంతలో సోనూ మట్కా పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. అనేక రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో నిందితుడికి బుల్లెట్ తగిలింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
Read Also: Bihar: బీహార్‌లో మావోల దుశ్చర్య..? రెండు జేసీబీలతో సహా 6 వాహనాలు దగ్ధం
అక్టోబర్ 31వ తేదీ రాత్రి ఢిల్లీలోని షహ్దారాలోని ఫార్ష్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహారీ కాలనీలో సోను మట్కా జంట హత్యలకు పాల్పడ్డారు. 16 ఏళ్ల రిషబ్, అతని మామ 40 ఏళ్ల ఆకాష్ అలియాస్ ఛోటూను చంపేశాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే నిందితుడి గురించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. నిందితుడు సోనూ మట్కాపై యూపీ, ఢిల్లీలో దోపిడీ, హత్య కేసులు నమోదయ్యాయి.