NTV Telugu Site icon

Prashanth varma : రణ్ వీర్ సింగ్ మూవీ ఆగిపోయిందా..? క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..

Prashanth Varma

Prashanth Varma

Prashanth varma :టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ విభిన్న కథలతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన “కల్కి”,”జాంబీ రెడ్డి” సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంతవర్మ తెరకెక్కించిన “హనుమాన్”మూవీ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ రేంజ్ బాగా పెరిగింది. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Read Also :Bharatheeyudu 2 : ‘భారతీయుడు 2’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. గూస్ బంప్స్ గ్యారెంటీ..

అయితే ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రానికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది..అయితే భారీ స్థాయిలో తెరకెక్కుతున్నఈ చిత్రం సడెన్​గా ఆగిపోయిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి రణ్ వీర్ సింగ్ తప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయింది.అయితే ఈ వార్తలపై తాజాగా చిత్ర యూనిట్ ​ క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్​లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.అలాగే ఈ సినిమా షూటింగ్ ను హనుమాన్ జయంతి రోజున హైదరాబాద్​లో మొదలుపెట్టినట్లు ప్రకటించింది. ఇప్పటికే మూవీకి సంబంధించి రణవీర్ సింగ్ ​పై కొన్ని సీన్లు కూడా షూట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Show comments