Bharatheeyudu 2 : విశ్వనటుడు కమల్ హాసన్,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “భారతీయుడు2”. బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహా,ఏస్.జె.సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.
Read Also :Thandel : నాగచైతన్య “తండేల్” న్యూ లుక్ వైరల్..
జూలై 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు.”పారా”అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా వుంది.అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు.ప్రస్తుతం ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది.