NTV Telugu Site icon

Haryana Assembly Election 2024: 90 అసెంబ్లీ స్థానాలకు మొదలైన ఓటింగ్!

Haryana

Haryana

Haryana Assembly Election 2024: హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు శనివారం (అక్టోబర్ 5) ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్, జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలాతో పాటు 1027 మంది అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) – బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కూటమి ఇంకా జననాయక్ జనతా పార్టీ (JJP) – ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) కూటమిలు పోటీలో ఉన్నాయి.

IND W vs NZ W: ప్రపంచ కప్‌లో భారత్‌ ఓటమి.. 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు!

ఇంతకుముందు హర్యానాలో అక్టోబర్ 1 న ఓటింగ్ జరగాల్సి ఉండగా, అయితే, కొన్ని కారణాలవల్ల నాలుగు రోజులు వాయిదా పడింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దాని ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడికానున్నాయి. జమ్మూ కాశ్మీర్‌ లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇది అక్టోబర్ 1న పూర్తయింది. రెండు రాష్ట్రాల్లోనూ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అక్టోబర్ 8వ తేదీన తేలనుంది.

Rajendra Prasad : సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.