Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Harshit Rana Ruled Out Of Ipl 2026 Big Blow To Kolkata Knight Riders Before Tournament

Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!

Published Date :March 14, 2026 , 8:53 am
By Kothuru Ram Kumar
  • IPL 2026 ప్రారంభానికి ముందే..
  • కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ షాక్
  • ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా మొత్తం టోర్నీకి దూరం..
  • హర్షిత్ రాణాను KKR ఫ్రాంచైజీ రూ.4 కోట్లకు రిటైన్..
Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Harshit Rana: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) గాయం కారణంగా మొత్తం IPL 2026 సీజన్‌కు దూరమయ్యాడు. హర్షిత్ రాణాను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్ IPL 2025లో హర్షిత్ రాణా 13 మ్యాచ్‌లు ఆడి మొత్తం 15 వికెట్లు తీసి మంచి ప్రదర్శన ఇచ్చాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్‌లో ఆయనకు గాయం కావడంతో టోర్నీకి కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం KKR అతనికి ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

SSC Exams: నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు, పేరెంట్స్ తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు

ఇప్పటికే జట్టు జింబాబ్వేకు చెందిన ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీను తమ స్క్వాడ్‌ లోకి తీసుకుంది. దీంతో హర్షిత్ రాణా స్థానాన్ని ముజరబానీ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్ తర్వాత హర్షిత్ రాణా కూడా జట్టుకు అందుబాటులో లేకపోవడం ఇప్పుడు KKRకు పెద్ద దెబ్బగా మారింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ విషయంలో జట్టుకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. జట్టులో ప్రస్తుతం శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానా ఉన్నాడు. ఆయనను వేలంలో రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది జట్టు యాజమాన్యం.

Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

ముజరబానీ విషయానికి వస్తే.. T20 వరల్డ్ కప్ 2026లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అతను ఒకరు. మొత్తం టోర్నీలో 13 వికెట్లు సాధించాడు. దీంతో హర్షిత్ రాణా లేమిని ముజరబానీ పూడ్చగలడని కోల్‌కతా ఆశిస్తోంది. ఇదిలా ఉంటే కోల్‌కతా నైట్ రైడర్స్ నేడు (మార్చి 14) తమ కొత్త జెర్సీని విడుదల చేయనుంది. అలాగే బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, IPL 2026లో KKR తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్ తో ఆడనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Blessing Muzarabani
  • Harshit Rana
  • Harshit Rana Injury
  • Harshit Rana Out
  • IPL 2026

తాజావార్తలు

  • Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!

  • SSC Exams: నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు, పేరెంట్స్ తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు

  • Trump: రష్యా క్లారిటీ ఇచ్చినా.. అమెరికా అనుమానాలు.. పుతిన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు..

  • Janasena Party Formation Day: నేడే “జనసేన” పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. పాడేరు పర్యటనలో డిప్యూటీ సీఎం..!

  • Saturday Horoscope: శనివారం రాశి ఫలాలు.. ఆ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాల్సిందే..!

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions