Harsh Goenka: ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తాజా రాజకీయాలు, వ్యాపారం, ప్రస్తుత సంఘటనలపై తనదైన వ్యంగ్య, హాస్యభరితంగా పోస్టులు పెడుతుంటారు. అయితే, నిన్న (అక్టోబర్ 8న) ఆయన చేసిన ఒక పరోక్ష విమర్శ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాయాది దేశం పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ, ప్రపంచ నాయకులు వారి “పెంపుడు జంతువుల” గురించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అందులో పరోక్షంగా పాకిస్తాన్‌ను అమెరికా పెంచి పోషిస్తున్న ‘కుక్క’ (పెట్)తో పోల్చారు.
Read Also: Nayanthara : 22 ఏళ్ల సినీ జర్నీ.. ప్రతి షాట్ నా జీవితాన్ని మార్చింది
ఆయన పోస్ట్‌లో ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పెంపుడు కుక్కతో ఉండగా, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఆవుతో (గోమాత/గో సంస్కృతికి ప్రతీకగా) ఉన్నారు.. ఇక, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం తన పెంపుడు కుక్కతో ఉన్నారు. కానీ, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పెంచి పోషిస్తున్న కుక్క (పాకిస్తాన్) తో ఉన్నారని అర్థం వచ్చేలా ఆయన రాసుకొచ్చారు. అయితే, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో, నెటిజన్లు దీనిపై విభిన్న రకాలుగా స్పందిస్తూ స్పందిస్తున్నారు. గోయెంకా చేసిన ఈ పరోక్ష విమర్శకు కొందరు మద్దతు ఇస్తుండగా, మరికొందరు ఆయన కామెడీని మెచ్చుకుంటున్నారు.
All global leaders have their favourite pets….😀 pic.twitter.com/9FtWNwsukH
— Harsh Goenka (@hvgoenka) October 8, 2025
