NTV Telugu Site icon

Harmanpreet Kaur: అంపైర్‌ నిర్ణయంపై కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైర్..(వీడియో)

Harmanpreet Kaur

Harmanpreet Kaur

Harmanpreet Kaur: ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా శుక్రవారం నాడు జరిగిన భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగగా అందులో భారత జట్టు ఓటమి పాలైంది. మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఏకంగా 58 పరుగుల తేడాతో విజయం అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు సాధించించింది. ఇక 161 పరుగుల టార్గెట్ తో చేధనకు దిగిన భారత్ జట్టు ఆదినుండే చతికిలపడింది. చివరకి కేవలం 19 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయ్యి భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై వివాదం చెలరేగింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే..

Mobile Connections: దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్.. 45 లక్షల ఫేక్ కాల్స్ బ్లాక్

కివీస్ బ్యాట్స్‌మెన్‌కు రనౌట్ అయినా ఇవ్వకపోవడంతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్‌లో ఆమె అంపైర్లతో వాగ్వాదానికి దిగింది. అంతే కాదు, బౌండరీ వెలుపల థర్డ్ అంపైర్‌తో భారత జట్టు కోచ్ వాగ్వాదానికి దిగడం కూడా కనిపించింది. దాంతో కొన్ని నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సంతృప్తి చెందలేదు. ఫీల్డ్ అంపైర్ వాదన తర్వాత బౌండరీ దగ్గర నిలబడి ఉన్న థర్డ్ అంపైర్‌తో ఆమె గొడవకు దిగింది. అదే సమయంలో భారత జట్టు కోచ్ అమోల్ మజుందార్ కూడా అంపైర్‌తో మాట్లాడుతున్నాడు.

IND W vs NZ W: ప్రపంచ కప్‌లో భారత్‌ ఓటమి.. 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు

14వ ఓవర్ చివరి బంతికి అమేలియా కెర్ ఒక పరుగు కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత బ్యాటర్లు అమేలియా, సోఫీ రెండో పరుగు కోసం ప్రయత్నం చేసారు. దాంతో హర్మన్ నుంచి బంతి అందుకున్న వికెట్ కీపర్ రిచా ఘోష్ అమేలియాను రనౌట్ చేయగలిగింది. దీంతో బ్యాటెర్ రనౌట్ అయినట్లు భావించి పెవిలియన్ వైపు వెళ్లేందుకు అడుగులు వేస్తోంది. ఇక్కడే, అంపైర్లు ఆ ఔట్ పరిగణలోకి రాదంటూ చెప్పారు. అంపైర్ బంతి అప్పటికే డెడ్ అయినట్లు తెలిపి ఆమెను వెనక్కు పిలిచింది. కాకపోతే., బంతి డెడ్‌గా ప్రకటించబడిన తర్వాత కూడా అమేలియా ఉద్దేశపూర్వకంగానే పరుగులు చేసేందుకు అవతలి ఎండ్‌ వైపు పరుగెత్తినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. కానీ., అంపైర్ అమీలియాకు అనుకూలంగా తీర్పునిచ్చాడు. దీంతో అభిమానులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.