NTV Telugu Site icon

Harmanpreet Kaur Suspended : టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై నిషేధం!

Harmanpreet Kaur Ban

Harmanpreet Kaur Ban

ICC Suspended India Women Skipper Harmanpreet Kaur for 2 T20I Matches: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు భారీ షాక్ తగిలింది. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు హర్మన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. భారత కెప్టెన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ మంగళవారం ప్రకటించింది. అంతేకాదు హర్మన్‌కు నాలుగు డీమెరిట్ పాయింట్లు, మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత పెట్టింది. ఈ నిషేధం కారణంగా ఆసియా గేమ్స్ 2023లోని తొలి రెండు మ్యాచ్‌లకు ఆమె దూరం కానుంది.

‘ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను తర్వాతి రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్‌ చేశాం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వికెట్లను కొట్టినందుకు లెవల్‌-2 తప్పిదం కింద హర్మన్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతంతో పాటు 3 డీ మెరిట్‌ పాయింట్లు.. అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుపట్టినందుకు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ విధించింది. తాజాగా బంగ్లాదేశ్‌ మహిళలతో జరిగిన మూడో వన్డేలో హర్మన్‌ దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.

Also Read: Heavy Rains: నేడు భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ! అస్సలు బయటకు రావొద్దు

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టింది. బంగ్లా బౌలర్‌ నహిదా అక్తర్‌ బౌలింగ్‌లో (34వ ఓవర్లో నాలుగో బంతి) హర్మన్‌ స్వీప్‌ షాట్‌ ఆడింది. బంతి బ్యాట్‌కు తగలకుండా ప్యాడ్‌కు తాకింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్‌ చేయగా.. ఎల్బీడబ్ల్యూ అంటూ అంపైర్‌ వెంటనే ఔట్ ఇచ్చాడు. అయితే బంతి లెగ్‌ స్టంప్‌నకు ఆవల పిచ్‌ అయిందనుకున్న హర్మన్‌.. తాను ఔట్ కాకపోయినా తప్పుడు నిర్ణయంతో బలిచేశారని ఆగ్రహించింది. ఆ కోపంలోనే వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. ఆ తర్వాత క్రీజ్ వదులుతూ అంపైర్లపై బహిరంగ విమర్శలు చేసింది. బహుమతి ప్రదానోత్సవం సందర్భంలోనూ బంగ్లా ఆటగాళ్లపై విమర్శలు చేసింది. దాంతో ఐసీసీ చర్యలు తీసుకుంది.

ఐసీసీ చర్యల అనంతరం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. ఒక టెస్టు మ్యాచ్‌, రెండు వన్డేలు లేదా రెండు టీ20లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. భారత్ తదుపరి సిరీస్‌ ఆసియా గేమ్స్ 2023. ఆసియా గేమ్స్ టీ20 ఫార్మాట్లో జరగనున్నాయి కాబట్టి తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్‌ అందుబాటులో లేకుండా పోయింది. కీలక మ్యాచులకు భారత కెప్టెన్ అందుబాటులో ఉండకపోవడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి.

Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పసిడి ధరలు!