‘గబ్బర్ సింగ్’ సక్సెస్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందే ఊహించారని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పారు. డబ్బింగ్ సమయంలోనే పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందని తనతో అన్నారని తెలిపారు. సినిమా సక్సెస్‌ను అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి నిర్మాత బండ్ల గణేశ్ అని పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ అంటేనే ఒక చరిత్ర అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మీడియాతో ముచ్చటించి పలు విషయాలను పంచుకున్నారు.
Also Read: Bandla Ganesh: ఏదో మూడ్‌లో ఉండి తిట్టా.. త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెబుతున్నా: బండ్ల గణేశ్
డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ… ‘సోషల్ మీడియా ఆధిపత్యం ఉన్న ఈరోజుల్లో గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అయి ఉంటే ఎంత బాగుండేదో అని నా మనసులో ఎప్పటినుంచో ఓ కోరిక ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరింది. నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ఈ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. గబ్బర్ సింగ్ అంటేనే ఓ చరిత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. మా జీవితాలను మార్చేసిన సినిమా ఇది. ఈ సినిమా మేము ఊహించిన దానికంటే భారీ విజయం సాధించింది. ఎక్కడికి వెళ్లినా నాపై అభిమానాన్ని చూపించారు. ఈ సక్సెస్‌ను బలంగా కోరుకున్న వ్యక్తి బండ్ల గణేశ్. ఈ సినిమా సక్సెస్‌ను ఊహించిన తొలి వ్యక్తి పవన్ కల్యాణ్ గారే. డబ్బింగ్ సమయంలోనే పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందని అన్నారు. ఇది ఎవర్ గ్రీన్ సినిమా’ అని అన్నారు.