Harish Shankar: పవన్ కల్యాణ్ నిజాయతీపై హరీశ్ శంకర్ సెన్సేషనల్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలోని రెండో పాట ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ను ఆదివారం మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ నిజాయతీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
READ ALSO: Donald Trump: ట్రంప్ ఇంట్లోకి ఆగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ..
Also Read
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- 7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women's Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గబ్బర్ సింగ్ చిత్రంతో పవన్ కల్యాణ్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. అప్పట్లోనే షారుక్ ఖాన్‌తో సమానమైన భారీ రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేస్తూ కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రకటనల కోసం ఆయన్ని సంప్రదించాయి. కానీ, ఆ ఉత్పత్తులు ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచివి కావన్న ఉద్దేశంతో ఆయన కళ్లముందే కోట్ల రూపాయల ఆఫర్లను వద్దనుకున్నారు. డబ్బుకు ఏమాత్రం లొంగని వ్యక్తి ఆయన’’ అని హరీశ్ ప్రశంసించారు. సాధారణంగా హీరో ఇంట్రో సాంగ్స్ ఎవరికైనా సెట్ అవుతాయని, కానీ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ మాత్రం కేవలం పవన్ కల్యాణ్ కోసం రాసినదని హరీశ్ తెలిపారు.
పవన్ కల్యాణ్ జీవనశైలి, ఆయన రాజకీయ, సినీ ప్రయాణంపై ఉన్న అవగాహనతో చంద్రబోస్ ఈ పాటలోని ప్రతి పదాన్ని అద్భుతంగా రాశారని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారని, అభిమానులు పాలాభిషేకం చేస్తే.. తన టీమ్ ఇలా సిరాభిషేకం, పాటాభిషేకం చేశారని కొనియాడారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్స్‌లోకి రాబోతుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ సినిమాలో పుష్కలంగా ఉంటాయని హరీశ్ శంకర్ ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు.
READ ALSO: Aura of Ustaad: మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది!
తాజావార్తలు
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?