Site icon NTV Telugu

Harish Shankar : కెవ్వు.. కేక.. అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..

Harish Shankar

Harish Shankar

Harish Shankar : సినిమాకి కేవలం కథ మాత్రమే కాకుండా పాటలు, ఫైట్స్, నటీనటుల నటన ఇలా అనేక విషయాలు సినిమా విజయం సాధించడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో కొత్త సినిమాలలో సంబంధించిన పాటలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నాయి చిత్ర బృందాలు. ఇదివరకు కాలంలో సినిమా రిలీజ్ కాకముందే సినిమా పాటలు ఒక ఆల్బమ్ లాగా రిలీజ్ అయ్యేవి. కానీ రాను రాను పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఒక్కొక్క పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నారు. ఇకపోతే దర్శకుడు హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి చేసిన సినిమా గబ్బర్ సింగ్ లో సాంగ్ ‘కెవ్వు కేక’ కూడా అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది.

Income Tax Department: పాన్ జిరాక్స్ లు ఎవరికైనా ఇస్తున్నారా..? అయితే మీరు ఈ వీడియో చుడాలిసిందే..

ఇక అదే పాట రచయితను మరోసారి హరి శంకర్ అల్లు అర్జున్ తో చేసిన డీజే సినిమాకి అస్మైక యోగం అనే పాటను రచయిత సాహితీ అందించారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి హరీష్ శంకర్, రచయిత సాహితి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా హరీష్ శంకర్ సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. “నీలాకాశం నీడన బిడియాలన్నీ వీడనా….. నీ కుచ్చిలి మార్చి ముచ్చట తీర్చేయ్ నా“ అంటూ సాగే సాహిత్యం లైన్స్ ని రాస్తూ.. రవితేజతో చేస్తున్న “మిస్టర్ బచ్చన్” కోసం తాను మరోసారి సాహితి గారితో వర్క్ చేయడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నాను అంటూ తమ నుంచి కెవ్వు కేక, అస్మైక యోగం లాంటి చార్ట్ బస్టర్స్ ఆల్రెడీ ఉన్నాయని హరీష్ గుర్తు చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kalki 2898 AD : చాలు చాలు ఈ మాత్రం చాలు.. కల్కి!

Exit mobile version