Site icon NTV Telugu

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..

Harish Rao

Harish Rao

Harish Rao writes open letter: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయవద్దనే ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాటు వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతుంది అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లు ఇస్తున్నారు.. కానీ, ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా సరే మొత్తం 201 యూనిట్లకు బిల్లు వసూలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. వినియోగదారులు ప్రతీ రోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాము? మీటర్ ఎంత తిరుగుతుంది? అనేది చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. 200 యూనిట్లు దాటితే 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వమే భరించి.. మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని హరీశ్ రావు విన్నవించుకున్నారు.

Read Also: Abu Dhabi: రికార్డ్ స్థాయిలో బీఏపీఎస్ టెంపుల్ సందర్శన

ఇక, తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డులుంటే.. ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తుందని హరీశ్ రావు అన్నారు. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుంది.. హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. కేవలం మూడో వంతు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.. రెండు వంతుల పేదలను విస్మరిస్తున్నారు.. ఇది సరైంది కాదు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు.. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి బతుకుతున్నారు అని హరీశ్ రావు వెల్లడించారు.

Read Also: Credit Card: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు.. కానీ, ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తుంది అని హరీశ్ రావు అన్నారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు.. ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలి.. నిజమైన పేదలకు న్యాయం చేయడమే మీ ప్రభుత్వ లక్ష్యమైతే.. మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలి.. అలా చేయని పక్షంలో ఈ పథకం కేవలం నామమాత్రంగానే మిగిలిపోతుందన్నారు. హామీల అమలుకు ప్రభుత్వమే తూట్లు పొడిచినట్లు అవుతుందనే విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాము.. నిజంగా పేదలకు సాయం చేయాలనే చిత్తశుద్ధి మీకుంటే.. వెంటనేపై మూడు విషయాల్లో తక్షణం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Exit mobile version