NTV Telugu Site icon

Harish Rao : అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడు

Harish Rao

Harish Rao

Harish Rao : అమీన్ పూర్‌ మండలం ఐలాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బంధు, యాదవులకు గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు నిలిపేశారన్నారు. హైడ్రా పేరుతో విధ్వంసం చేయడమే తప్ప, ఏడాది పాలనలో ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా పొందలేకపోయారని, రాహుల్ దగ్గర కూడా రేవంత్ హిట్ వికెట్ అయ్యాడన్నారు హరీష్‌ రావు. ముఖ్యమంత్రిగా నీ పని అయిపోయింది అంటూ తీవ్ర విమర్శలు చేశారు హరీష్‌ రావు.

Bandi Sanjay : నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను

తులం బంగారం అడిగితే పండబెట్టి తొక్కుతా అంటావా? ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాగే మాట్లాడుతారా? అని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. గురుకులాల విద్యార్థులు చనిపోవడం, ఆటో కార్మికుల జీవితాలు ఆగిపోవడం వంటి అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని, రాష్ట్రంలోని అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి రోడ్ల మీదకు రప్పించారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. “అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు మా పూర్తిస్థాయి మద్దతు ఉంటుంది” అని హరీష్ రావు భరోసా ఇచ్చారు.

Swallows Set of Teeth : నిద్రలో ప‌ళ్ల సెట్ మింగేసిన వ్యక్తి.. ఆ తరువాత..!

Show comments