స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతల ఆర్థిక స్థితిగతులు, వారిలో పెరుగుతున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ మేరకు రూ.లక్ష లోపు ఉన్న రుణమాఫీ ప్రక్రియను సోమవారంతో పూర్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. దీనిపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ ట్విట్టర్ వేదికగా ‘రావు రూ. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రైతు సంక్షేమం విషయంలో సీఎం గారు ఏనాడూ రాజీ పడలేదు.
Also Read : Supreme Court: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ వారు అర్హులు కాదు: సుప్రీం తీర్పు
ఒకే రోజు మొత్తం 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేసి అత్యధికంగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేసిన రికార్డును తెలంగాణ నెలకొల్పింది. దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, లైన్ లో నిలుచునే అవస్థ లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రూపాయి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమవుతోంది.రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిరాటంకంగా కొనసాగించారు. ఇప్పుడు అదే రీతిగా రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారు. సీఎం గారు రైతుల పక్షపాతి అని చెప్పేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనం.’ అని హరీష్ ట్వీట్ చేశారు.
Also Read : Durga Stotram: ఈ స్తోత్రాలు వింటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది
