Site icon NTV Telugu

Harish Rao : దేశంలో మూడు రకాల చెత్తను వేరు చేసే ఒకే ఒక్క పట్టణం సిద్దిపేట

Harish Rao

Harish Rao

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేటలో పట్టణ ప్రగతి దినోత్సవంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. స్వచ్ఛత అంటేనే సిద్దిపేట, స్వచ్ఛ సిద్దిపేటలో అందరూ సైనికులులాగా పనిచేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో మున్సిపల్ కార్మికులకు 6800జీతం ఇస్తే… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 15,800 రూపాయలను అందిస్తోందన్నారు. భారతదేశంలో మూడు రకాల చెత్తను వేరు చేసే ఒకేఒక్క పట్టణం సిద్దిపేట అని ఆయన వ్యాఖ్యానించారు. సిద్దిపేట స్వచ్ఛబడి రాష్ట్రానికి స్ఫూర్తి అని ఆయన అన్నారు.

Also Read : Sreleela : ఆ విషయంలో రష్మిక బాటలో నడుస్తున్న శ్రీలీల..!!

ఇదిలా ఉంటే.. సిఐఐ ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్ లో నిర్వహించిన CFO 2023 సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌ రావు హాజ‌రైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సిఐఐ 4వ ఎడిషన్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సాంకేతికత, పరిశోధన, సుపరిపాలన ఈ మూడు అంశాలతో సభ నిర్వహించడం గొప్ప విషయమని, సీఎఫ్‌వో సభ్యులుగా మీరు చేసే కృషి వల్ల సంస్థతో పాటు ఈ దేశం కూడా బలపడుతుందన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ అంధకారంలో ఉంటుంది అని అన్నవాళ్లే ఈరోజు తెలంగాణ మోడల్ అని అంటున్నారన్నారు.

Also Read : Hanuman: మేము రిస్క్ చేయడం లేదు.. ‘హనుమాన్’ సినిమాపై ప్రశాంత్ వర్మ క్లారిటీ

Exit mobile version