NTV Telugu Site icon

Harish Rao : సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్

Harish Rao

Harish Rao

బీఆర్‌ఎస్‌ పార్టీ నేడు సిద్ధిపేటలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కలను నిజం చేసిన సిద్దిపేట పురిటిగడ్డ మన సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. ఇది ఎన్నికల ప్రచార సభలగా లేదని.. మన కలను నిజం చేసిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత సభలా అనిపిస్తుందన్నారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. కేసీఆర్ ని కారణజన్ముడు అంటారని, ఆనాటి సీఎం ఎన్టీరామారావుకి సిద్దిపేట జిల్లా కావాలని సీఎం కేసీఆర్ వినతి పత్రం ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయనే సిద్దిపేటను జిల్లా చేశారన్నారు. సిద్దిపేటకి రైలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని మంత్రి హరీష్‌ రావు అన్నారు.

Also Read : CM KCR : కేటీఆర్ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు… ఆదరించి గెలిపించండి..

అంతేకాకుండా.. ‘సిద్దిపేట కి కాళేశ్వరం నీళ్లు వస్తాయి అంటే ప్రతి పక్షాలు ఎగతాళి చేశాయి. మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి సిద్దిపేటకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే. పదేళ్ల కింద కూలి దొరక్కపోయేది..కానీ ఇప్పుడు కూలి చేయడానికి మనుషులే దొరకట్లేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో సిద్దిపేటలో కరువు కాటకాలు. కేసీఆర్ గురించి కొంతమందికి తెలియదు..కానీ సిద్దిపేట ప్రజలకి ఆయన గురించి తెలుసు. తెలంగాణకి సీఎంగా ఉన్న ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఓ రైతు బిడ్డ కాబట్టే..రైతుల బాధలు ఆయనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఒక్క చాన్స్ ఒక్క చాన్స్ అంటున్నారు. మీకు 11 సార్లు అధికారం ఇచ్చినా మీరు చేయలేని పనిని 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు. సీఎం పాలనలో ఎండాకాలం కూడా వానాకాలం లాగా అయ్యింది. ఆనాడు రాజగోపాల్ పేట చెరువు నిండితే వార్త…కానీ ఇప్పుడు అది ఎండితే వార్త. గత ఎన్నికల సభలో హరీష్ రావును అశీర్వదించండి అని సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ దివేనలతో సిద్దిపేటకి సేవ చేసే అవకాశం దక్కింది. నా శ్వాస ఉన్నంత వరకు మీతోనే ఉంటా.’ అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు.

Also Read : Ayurveda Tips for Kidney: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలపై శ్రద్ధ వహించండి..