Site icon NTV Telugu

Harish Rao: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు మాజీమంత్రి హరీష్‌రావు లేఖ..

Harishrao

Harishrao

Harish Rao: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. శాసనసభ నిబంధనలను పట్టించుకోకుండా అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని పేర్కొన్నారు. “రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి. అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలి. అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి. ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి. సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలి. పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలి.” అని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు.

READ MORE: kollywood : హీరోయిన్ కు కోలీవుడ్ కష్టాలు తీరేదెపుడో

Exit mobile version