Harish Rao: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. శాసనసభ నిబంధనలను పట్టించుకోకుండా అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని పేర్కొన్నారు. "రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి.
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. 25 శాతం మాత్రమే కేంద్రం కొంటుందని మిగతా 75 శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Harish Rao: టెట్ ఫీజులు తగ్గించాలి లేకుంటే నిరుద్యోగుల తరుపున పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గురించి లేఖలో వివరించారు.