Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
22A నిషేధిత జాబితాతో సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భూములను ఆ జాబితాలో పెట్టిన ప్రభుత్వమే తక్షణమే వాటిని తొలగించాలని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తప్పు చేయకపోతే 22Aలోని భూములను వెంటనే ఓపెన్ చేయాలని, సర్వే నంబర్ల వారీగా వెరిఫై చేసి కేవలం ప్రభుత్వ భూములను మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచాలని స్పష్టం చేశారు. ఎంత విస్తీర్ణంలో భూములను 22Aలో పెట్టారో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయకపోతే ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఈ 22A స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
ఈ ఇష్యూలో అధికారుల తప్పు ఉంటే వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు, విచారణకు ఎందుకు ఆదేశించలేదని ఆయన ప్రశ్నించారు. 22A వ్యవహారంలో ఏ1 రేవంత్ రెడ్డి, ఏ2 పొంగులేటి అని ఆరోపిస్తూ, మంత్రి పొంగులేటి పొందిన లబ్ధిని త్వరలోనే అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెడతామని అన్నారు. గతంలో ప్రభుత్వమే అమ్మిన భూములతో పాటు బోడుప్పల్, ఘట్కేసర్, అల్మాస్ గుడా, జిల్లెలగూడా, ఆదిబట్ల, మీర్పేట్ వంటి ప్రాంతాల్లో దశాబ్దాల క్రితం లేఅవుట్లు చేసుకుని, బ్యాంక్ లోన్లతో ఇండ్లు కట్టుకున్న వేలాది కుటుంబాల భూములను నిషేధిత జాబితాలో పెట్టడంపై మండిపడ్డారు.
Also Read
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ఒక్క పఠాన్‌చెరు నియోజకవర్గంలోనే గుమ్మడిదలలో 12,430 ఎకరాలు, అమీన్పూర్లో 3,266 ఎకరాలు, రామచంద్రాపురంలో 8,360 ఎకరాలు, పఠాన్‌చెరులో 12,593 ఎకరాల చొప్పున మొత్తం 50,565 ఎకరాల భూమిని 22A పరిధిలోకి తీసుకువచ్చారని హరీష్ రావు తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా త్వరలోనే ప్రజలు 22A (నిషేధిత) జాబితాలో పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు.
తాజావార్తలు
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ