సంగారెడ్డిలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అక్క, చెల్లెళ్లందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదింటి ఆడపిల్లల తల్లులకు ఓ వరం అయ్యిండు సీఎం కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. కళ్యాణలక్ష్మితో పెళ్లికి అదుకున్నాడని, ఆరోగ్య లక్ష్మీతో బిడ్డ కడుపులో ఉండగానే పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్‌తో డెలివరీ కాగానే కిట్ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి ప్లేస్‌లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 1600 కాన్పులు అయితే కేవలం 200 మాత్రమే ప్రయివేట్ ఆస్పత్రుల్లో అయ్యాయన్నారు. మొదటి గంట తల్లిపాలు అమృతంతో సమానమని ఆయన పేర్కొన్నారు.
Also Read : Minister KTR : ఆశా వర్కర్లకు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే
శ్రీ రామ నవమి నుంచి న్యూట్రిషన్ కిట్ ఇస్తామని ఆయన తెలిపారు. తల్లికి అవసరమైన పౌష్టికాహారాన్ని ఈ కిట్ లో ఇస్తామని, రెండు సార్లు ఈ కిట్ ఇస్తాము..6 లక్షల మందికి ఈ కిట్ అందజేస్తామన్నారు. తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలను గెలిపించిన మనకి తాగడానికి బుక్కెడు నీళ్లు ఇవ్వలేదని, గతంలో మంచి నీళ్ళ కోసం బావుల దగ్గరికి వెళ్ళాలి.. కానీ ఇప్పుడు ఇంటి దగ్గరే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని ఆయన అన్నారు.
Also Read : Manchu Manoj: రాజకీయాల ఆలోచన లేదు, ప్రజా సేవ చెయ్యాలన్న కోరిక వుంది
దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంటింటికి నీళ్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని, 46 మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు మహిళలకు చదువు చెప్పిస్తున్నారన్నారు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చిండు కేసీఆర్ అని, వృద్ధులకు పెద్ద కొడుకులాగా కేసీఆర్ ఆదుకుంటున్నాడని ఆయన అన్నారు.