NTV Telugu Site icon

Harish Rao : కాంగ్రెస్ పాలనలో లీకులు ఇస్తూ .. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు

Harish Rao

Harish Rao

కాంగ్రెస్ 100రోజుల పాలనలో ఉద్దేర మాటలు తప్ప, ఉద్దరించింది ఏమి లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన కామారెడ్డిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో లీకులు ఇస్తూ .. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని, పెద్ద ఎమ్మెల్యేలను కొంటారు తప్ప, ఉద్యమకారులను కార్యకర్తలను రేవంత్ రెడ్డి కొనలేరని ఆయన వ్యాఖ్యానించారు. పేగులు మేడల వేసుకోవడం కాదు, పేదలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే భవిషత్ ఉండదు. బీబీ పాటిల్ గళం విప్పలేదన్నారు. రాముడు అందరి వాడు.. దేవున్ని రాజకీయం చేయడం సరైంది కాదని ఆయన హితవుపలికారు.

Andhra Pradesh: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం క్లారిటీ 

బీజేపీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమి లేదని, కేసీఆర్ జిల్లాలు ఇస్తే రేవంత్ రెడ్డి కుదిస్తా అంటున్నారన్నారు. 33జిల్లాలను 17 జిల్లాలు గా మారుస్తా అంటున్నారని, కామారెడ్డి జిల్లా ఉండాలంటే కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి లీకులు అని, అక్రమ కేసులకు భయపడేది లేదు. భవిష్యత్ మనదే అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతుక బీఆర్‌ఎస్‌ మాత్రమేనని, కాంగ్రెస్ బీజేపీ గెలిస్తే ఢిల్లీలో గులాం గిరి చేస్తారన్నారు.

 Prabhakar Chowdary: కార్యకర్తలు ఓకే అంటే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా: ప్రభాకర్ చౌదరి