సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా…? తెలంగాణ లేకపోతే ఆయన గురువు చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తేవాడని ఆయన విమర్శించారు. రేవంత్ కి మతిమరుపు వ్యాధి ఉన్నట్టు ఉందని, ఆగస్ట్ 15 న సిద్దిపేట కు వస్తాను అన్న సీఎం వ్యాఖ్యలని స్వాగతిస్తున్నానని, నేను మరోసారి సీఎం రేవంత్ కి ఛాలెంజ్ విసురుతున్నానని. నేను నా రాజీనామా మాటపై నిలబడుతున్నా అని ఆయన తెలిపారు.
అంతేకాకుండా..’వంద రోజుల్లో బాండ్ పేపర్లపై రాసిన గ్యారెంటీలు, 2 లక్షల ఋణమాఫీ చేస్తే నేనే రేవంత్ కి శాలువా కప్పి రాజీనామా చేస్తా. ఆగస్ట్ 15కైనా ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ చేస్తే స్వచ్చందంగా స్పీకర్ దగ్గరికి వెళ్లి రాజీనామా చేస్తా. ఒక వేళ నువ్ చేయకపోతే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తావా రేవంత్. ఇప్పటికైనా మీరు రాజీనామాకు సిద్ధమా. సిద్ధం అంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ కి మీ రాజీనామా పంపండి. నేను పది నిమిషాల్లో రాజీనామా లేక పంపుతా. రేవంత్ వచ్చాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిపోయింది.
రాష్టం దివాళా తీసిందని అంకెల గారడి తో అసందర్బంగా మాట్లాడుతున్నారు. సీఎం ఇలా మాట్లాడటం వాళ్ల పెట్టుబడులు రావట్లేదు. రాష్ట్రం ఆదాయం దెబ్బతినడానికి కారణం సీఎం మూర్ఖత్వం. సిద్దిపేట కి వచ్చి అభివృద్ధి లేదంటే జనం నవ్వుకుంటారు. కాంగ్రెస్, BJP లు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. నువ్ కొట్టినట్టు చేస్తే..నేను తిట్టినట్టు చేస్తా అని మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయి. బీఆర్‌ఎస్ పార్టీని లేకుండా చేయలేని ఇలా చేస్తున్నారు. రెండు పార్టీలు 8, 8 సీట్లు పంచుకున్నాయి. కాంగ్రెస్ గెలవాలన్న చోట బిజెపి, బీజేపీ గెలవాలన్న చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది.
హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. అక్కడ కాంగ్రెస్ బిజెపికి సపోర్టు చేసింది. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కి బిజెపి సపోర్ట్ చేసింది. లోకమంతా తిట్టుకుంటారు..తెలంగాణలో మాత్రం కాంగ్రేస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరింది.’ అని హరీష్ రావు అన్నారు.