NTV Telugu Site icon

Harish Rao : స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించిన హరీష్‌రావు

Gold Crown

Gold Crown

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనంతో భక్తులను స్వామి వారి అనుగ్రహిస్తున్నారు. అయితే.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆలయాల్లన్నీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటికిటలాడుతున్నాయి. అయితే.. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆలయాలు భక్తులు వేకువజామునుంచే పోటెత్తారు. దీంతో హరి నామస్మరణతో ఆలయాల్లో మారుమ్రోగుతున్నాయి.
Also Read : IMF: ఈ 3 దేశాల ఆర్థిక మందగమనం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది..

యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామి వారు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కావడంతో భక్తి జనం పోటెత్తారు. 6గంటల 48 నిమిషాలకు భక్తులకు శ్రీ లక్ష్మీనరసింహుడు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. అయితే.. ఉత్తర ద్వార దర్శనంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు. అంతేకాకుండా.. వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. హరి హరులు ఉత్తర ద్వారం ద్వార భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు.. తొలుత ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి భక్తులకు దర్శనం కల్పించారు అర్చకులు, అధికారులు.

Show comments