NTV Telugu Site icon

T. Harish Rao: బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

New Project (18)

New Project (18)

నాలుగు నెలలోనే కాంగ్రెస్ మోసం బయట పడింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే అని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అన్ని అబద్దాలే అన్నారు. కాంగ్రెస్ బండి ఇప్పుడు రివర్స్ గేర్ లో నడుస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు 24 గంటలు ఇస్తే.. ఇప్పుడు 14గంటలు మాత్రమే వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగించాలని కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం రూ.100కోట్లు ఇస్తామన్న కాంగ్రెస్ రూ.100 రూపాయలు కూడా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి గుణపాఠం చెప్పనున్నారని తెలిపారు. అబద్దాలు, మోసాలు, ఉన్న పథకాలు ఊదరగొట్టటం తప్పా.. కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమిలేదని విమర్శించారు.

READ MORE: Shabbir Ali: ముస్లిం రిజర్వేషన్ పై మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తా.. ప్రధానిపై షబ్బీర్ అలీ మండిపాటు

తమ్మినేని వీరభద్రం తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలపడం ముదిగొండ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ అన్నారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే తీన్మార్ మల్లన్న.. ఏ రోజైన పేద విద్యార్థుల కోసం మాట్లాడలేదన్నారు. 56 కేసులున్న తీన్మార్ మల్లన్న పట్టభద్రులగా ఎన్నుకుంటారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండరు లేదు.. తనను గెలిపిస్తే నిరుద్యోగుల, ఉద్యోగుల పట్ల ప్రశ్నించే గోతుకకై పోరాడుతా అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 46 ఎందుకు రద్దు చేయడం లేదని.. తాను ఎమ్మెల్సీ గా గెలిస్తే నా జీతంతో పేద విద్యార్థుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తా అని హామీ ఇచ్చారు.