NTV Telugu Site icon

Harish Rao : ఢిల్లీలో మోడీకి, ఇక్కడ ఉన్న రేవంత్‌కి మాటలెక్కువ, చేతలుతక్కువ

Harish Rao Revanth Reddy

Harish Rao Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. జగదేవ్ పూర్‌లో ఇవాళ హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దు అని రేవంత్ రెడ్డి అన్నారని, చెవేళ్ళలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి లో సునీతా, వరంగల్ లో కడియం కావ్య, సికింద్రాబాద్ లో దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. కాకులు వాలనీయను అని చెప్పి గద్దలను ఎత్తుకు వెళ్లినవ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. ఢిల్లీలో మోడీకి, ఇక్కడ ఉన్న రేవంత్ కి మాటలెక్కువ, చేతలుతక్కువ అని ఆయన మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీకి గడ్డ పారలు అవుతాయని, కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జమ్మికుంటలో పర్యటించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.