NTV Telugu Site icon

Harish Rao : సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల హరీష్ రావు ఫైర్

Harish Rao

Harish Rao

Harish Rao : రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామిని సీఎం రేవంత్‌ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్‌ స్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్‌ రావు. ‘సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి గారూ… టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపండి. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోండి.’ అని హరీష్‌ రావు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

Plane Crash : కజకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం.. 72 మంది మృతి

అంతేకాకుండా… అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదని, అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసారు. ఇప్పుడు రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బందాలకు గురిచేస్తున్నారు. ఇది హేయమైన చర్య అని ఆయన అన్నారు. నిర్బంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణం విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రెగ్యులైరైజేషన్ సహా ఇతర హామీలను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్‌ రావు అన్నారు.

Pushpa 2: బాలీవుడ్ స్టార్ హీరోలకు బిగ్ టార్గెట్ ఇచ్చిన పుష్పరాజ్!

Show comments