Site icon NTV Telugu

Harish rao : తెలంగాణకు వస్తున్న మోడీ ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలి

Harish Rao

Harish Rao

ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ఏర్పాటు అయ్యాక రెండు సార్లు కేంద్రానికి తీర్మానం చేసి పంపించామన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ఇందిరా పార్క్‌ వద్ద మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో ఎస్సీ వర్గీకరణ పై తాత్సారం చేస్తోందన్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణకు వస్తున్న మోడీ దీనిపై సమాధానం చెప్పి రావాలన్నారు మంత్రి హరీష్‌ రావు. మాదిగల పై మోడీకి చిత్తశుద్ది లేదని, కేసీఆర్ ఎన్నో సార్లు అడిగినా మోడీ పట్టించుకోవడం లేదన్నారు. తీర్మానం ప్రతిని ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి చేత మోడీకి ఇచ్చామని, కానీ మోడీ పట్టించుకోలేదన్నారు.

Also Read : World Cup 2023: కోల్‌కతాలో బ్లాక్లో టిక్కెట్ల అమ్మకాలు.. బీసీసీఐకి పోలీసులు నోటీసులు జారీ

వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ స్థాయి లో మన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు మంత్రి హరీష్‌ రావు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని, తెలంగాణ రాగానే కొంతమంది పదవులు వదిలేసి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళారన్నారు. మాదిగల ఆత్మగౌరవం పెరగాలని, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మాదిగల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సదా లక్ష్మీ విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తదని, ఎస్సీల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని, మాదిగలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో గాని ఇతర అవకాశాలు మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం కోసం సీఎం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు వరాల జల్లు కురిపించారు.

Also Read : World Cup 2023: కోల్‌కతాలో బ్లాక్లో టిక్కెట్ల అమ్మకాలు.. బీసీసీఐకి పోలీసులు నోటీసులు జారీ

Exit mobile version