రేవంత్ రెడ్డి మితి మీరిన అహంకారంతో మాట్లాడారని, వితండ వాదం చేశారని మండిపడ్డారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీచమైన పద్ధతి లో కేసీఅర్ పై వ్యక్తిగత దూషణలు చేశారు రేవంత్ అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మేము KRMBకి ప్రాజెక్ట్ లు అప్పజెప్పామని రంకెలు వేస్తుందని, KRMB మీటింగ్ లో ప్రాజెక్ట్ లు అప్పగించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందన్నారు హరీష్ రావు. రెండు రాష్ట్రాలు ఒక నెల రోజుల్లో 15 ప్రాజెక్టు లు అప్పగిస్తరని KRMB మీటింగ్ మినట్స్ లో ఉందని, ఫిబ్రవరి 1న జరిగిన సమావేశంలో KRMB మీటింగ్ మినిట్స్ లొ తెలంగాణ ప్రాజెక్ట్ లు అప్పగించడానికి అభ్యంతరం చెప్పలేదు అని ఉందని ఆయన పేర్కొన్నారు.
Srimanthudu: శ్రీమంతుడు ‘కథ’కి నారా రోహిత్ హీరో.. కానీ కాపీ కొట్టి మహేష్ తో తీసేశారు!
అంతేకాకుండా..’రెండు రాష్ట్రాల ENC లు ప్రాజెక్టు అప్పగించడానికి KRMB మీటింగ్ లో ఒప్పుకున్నారు. ఢిల్లీ కి ప్రాజెక్ట్ లు అప్పగించి తెలంగాణ ను అడుక్కునే పరిస్థితి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను నష్టం కలిగించేలా రేవంత్ రెడ్డి వ్యవహరించవద్దు. BRS సర్కార్ ఎప్పుడు ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకోలేదు. ఇదే విషయం KRMB మీటింగ్ మినిట్స్ లొ ఉంది. 17 KRMB మీటింగ్ లో ప్రాజెక్ట్ ల అప్పగింత అంశంను అపెక్స్ కౌన్సిల్ కు రెఫెర్ చేయాలని BRS ప్రభుత్వ ప్రతినిధి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి దగుల్ బాజీ మాటలు మాట్లాడుతున్నారు. పోతిరెడ్డీపాడు కు పొక్క పెద్దగా చేసినప్పుడు నాటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ ఇతరలు పెదవులు మూసుకున్నారు…మేం కాదు. మేము నాటి వైయస్ మంత్రివర్గం నుంచి మంత్రులుగా రాజీనామా చేసిన తరవాత పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. పదవుల కోసం పార్టీల మారిన చరిత్ర రేవంత్ రెడ్డి ది…ఆయన పక్కన ఉన్న నేతలు పెదవులు మూసుకున్నారు. మా తో పాటు గొంతు కలిపింది…కేవలం ఒక్క కాంగ్రెస్ నేత పీజేఆర్ మాత్రమే. పోతిరెడ్డీపాడు పై నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో 40 రోజుల పాటు పోరాటం చేశాం. రేవంత్ తీరు ఒల్ట్ చోర్ కొత్వాల్ కూ మారా అన్నట్టు ఉంది. రాయలసీమ లిఫ్ట్ గురించి కొట్లడిందే BRS సర్కార్. 2 వ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేసీఅర్ రాయలసీమ లిఫ్ట్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు ఎవరినీ జనం చెప్పులతో కొట్టాలి రేవంత్ రెడ్డి?.’ అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
IND vs ENG: చెలరేగిన బుమ్రా, అశ్విన్.. వైజాగ్ టెస్టులో భారత్ ఘన విజయం!
