Site icon NTV Telugu

Harish Rao : ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్ డ్యామ్‌లు కట్టారా

Harish Rao

Harish Rao

మెదక్ లోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యక్రమాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ 20 గంటల కరెంట్ ఇచ్చిందని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్లు చెప్పారని, హైదరాబాద్ కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామన్నారు. ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్ డ్యామ్ లు కట్టారా అని హరీష్‌ రావు ప్రశ్నించారు. రైతు బీమా దండగ అని అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు మాట్లాడటం సిగ్గుచేటు అని హరీష్‌ రావు మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు అసెంబ్లీలో అన్ని జుటా మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : MP Asaduddin: ప్రజా పాల‌న దరఖాస్తులు ఉర్దూ భాష‌లోనూ ఉండాలి.. ఎంఐఎం డిమాండ్‌

కాంగ్రెసోళ్లు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, తెలంగాణ కోసం నేను మెదక్ జైల్లో మూడు రోజులున్న అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాడింది బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా ఏందో చూపిద్దామని, మెదక్ ఎంపీ బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవడం పక్కా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజా క్షేత్రంలో కొట్లాడుదామన్నారు హరీష్‌ రావు.

Also Read : Road Accident: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ ఉండగానే కోళ్ల‌ను ఎత్తుకెళ్లిన జ‌నాలు! వీడియో వైరల్

Exit mobile version