Site icon NTV Telugu

Harish Rao : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటిలే మీకు భస్మాసురహస్తం అవుతాయి

Harish Rao

Harish Rao

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు 39 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా అని ఆయన అన్నారు. రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు ఇంకా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటిలే మీకు భస్మాసురహస్తం అవుతాయన్నారు హరీష్‌ రావు. సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారని, మిమ్మల్ని ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. రైతురుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, ఆసరా పెన్షన్ పెంపు, మహిళలకు 2500 రూపాయల సహయం, కళ్యాణాలక్ష్మి కి తులం బంగారం, నిరుద్యోగ భృతి పై మాట తప్పినందుకు కాంగ్రెస్ ని ఓడించాలని ఆయన కోరారు.

అంతేకాకుండా..’రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు..కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు. నాలుగున్నర నెలల్లోనే సీఎం ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అంటే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి. 2014, 2019 రెండు సార్లు దేశంలో కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కలేదు..మీ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారు. మీ పార్టీ నాయకులు మోత్కుపల్లి, హనుమంతరావు లే మా సీఎం కలవట్లేదు అని అంటున్నారు. మెడలో పేగులేసుకుంటా,మానవ బాంబునై పేలుతా, డ్రాయర్ ఊడగొడుతా అని సీఎం పదవికి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు.’ అని హరీష్‌ రావు అన్నారు.

Exit mobile version