సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్‌ఎస్ నేతలను శంషాబాద్ పీఎస్‌కు తరలించారు.
Russia: రష్యన్ ఆర్మీలో చేరిన 45 మంది భారతీయులకు విముక్తి.. మరో 50 మందిని రక్షించే ప్రయత్నం..
దాడి చేసిన వాళ్లను అరెస్ట్ చేయమని ప్రశ్నించినందుకు తమను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని హరీష్ రావు తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. పోలీసుల రాజ్యం నడుస్తుందని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు. అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశామని.. కానీ కేవలం 41 సీఆర్పీసీ నోటీసు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది.