Site icon NTV Telugu

Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

Harish Rao

Harish Rao

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. పరిగిలో రైతులకు సంఘీభావంగా వెళుతున్న హరీష్‌ను పోలీసుల అరెస్ట్ చేశారు. ఈ అంశంపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల బాధ వినడానికి తాము వెళ్తామ చెబుతున్నా వినడం లేదన్నారు. “రేవంత్ రెడ్డి పరిస్థితి పిచ్చోడు చేతిలో రాయిలాగా తయారైంది.. హైడ్రా పేరిట పేదల గుడిసెలు కూల్చే ప్రయత్నం చేశారు. మూసి పేరిట అపార్ట్మెంట్లను కూల్చే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ భూములను లాక్కునే ప్రయత్నం చేశారు. ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. దళిత బలహీన వర్గాల మీద దండయాత్ర చేస్తున్నారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు.. కానీ ఉన్న భూములు లాక్కుంటున్నారు. ఎక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళ భూములు ఉంటే అక్కడ ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తున్నారు ముందస్తుగా అరెస్టు చేసినా సరే మేము అక్కడికి వెళ్లి తీరుతాం. మీరు ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చండి. అధికారంలోకి వచ్చేవరకు ఒక మాట వచ్చిన తర్వాత మరో మాట కాంగ్రెస్ చెబుతోంది. భూములు తప్ప ఇంకోటి పట్టదా? పాలన చేయమంటే భూములు లాక్కోవడం ఏంటి?” అని హరీష్‌రావు ప్రశ్నించారు.

READ MORE: Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

అసలు ఏం జరిగింది?
పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమ భూములను ఇచ్చేది లేదని రైతులు రిలే దీక్షలు చేపట్టారు. రైతు ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లో పర్యటించి సంఘీభావం తెలిపేందుకు హరీష్‌రావు బయలు దేరారు. పరిగి పర్యటనకు బయల్దేరిన హరీష్‌ రావును అప్ప జంక్షన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన నేతలను స్టేషన్‌కు తరలించారు. ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ వైపు పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ నేతలను తరలించారు.

Exit mobile version