NTV Telugu Site icon

Harish Rao: ఓట్ల కోసం కాదు ప్రేమతో ఇచ్చాం.. రైతు బంధు ఆపిందే కాంగ్రెస్సే.

Harihshrao

Harihshrao

జహీరాబాద్ నియోజకవర్గం ఝారసంఘంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. పొయ్యిలో నుంచి పెనంలో పడ్డట్టు కర్ణాటక ప్రజల పరిస్థితి అయ్యింది.. అక్కడ మూడు గంటలే కరెంట్ ఇస్తున్నారు.. తప్పిపోయి కాంగ్రెస్ కి ఓటేస్తే ఆగం అవుతాం.. రాహుల్ గాంధీ ఇక్కడకి వచ్చి నాటకాలు ఆడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు మీటింగ్ పెట్టాల్సింది ఇక్కడ కాదు.. కర్నాటకలో మీటింగ్ పెట్టి 5 గ్యారెంటీలు ఇచ్చావా లేదా చెప్పు.. కాంగ్రెస్ వాళ్ళవి జూట మాటలు.. నిన్న కాక మొన్న ఎలక్షన్ కమిషన్ రైతుబంధుకి అనుమతి ఇచ్చింది.. కాంగ్రెస్ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా అనుమతి వచ్చింది అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Read Also: Mouni Roy: డ్రెస్ లో నాగినీ భామ సొగసుల ప్రదర్శన.. సైడ్ యాంగిల్ లో హాట్ పోజులు..

ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అని నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నిరంజన్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నోటి కాడా బుక్కను ఆపింది కాంగ్రెస్.. ఎన్ని రోజులు ఆపుతారు రైతుబంధు.. వచ్చేది మన ప్రభుత్వమే 3 తేదీ తర్వాత మళ్ళీ రైతుబంధు డబ్బులు టింగ్ టింగ్ మని అకౌంట్లో పడతాయి.. మాది ఓటు బంధం కాదు..మాది పేగు బంధం.. ఓట్ల కోసం మేము రైతు బంధు ఇవ్వలేదు.. ప్రేమతో ఇచ్చామని ఆయన తెలిపారు.