Site icon NTV Telugu

Harish Rao : కేసిఆర్ ఉన్నంత కాలం వ్యవసాయం మొదటి ప్రాధాన్యత

Harish Rao

Harish Rao

హైదరబాద్ లోని అబిడ్స్ లో రెడ్డీస్ హాస్టల్ లో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం వ్యవసాయ డైరీ, 2023 క్యాలెండర్‌లను మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం బాగా జరుగుతుంది అందుకే దేశం మనవైపు చూస్తుందన్నారు. రాష్ట్రం పండించిన పంటను కొనలేని స్థితికి కేంద్రం వచ్చిందని, ఒకప్పుడు వ్యవసాయ శాఖ లాస్ట్ ప్రయారిటీ ఆ ప్రభుత్వానికీ. యిపుడు మొదటి ప్రాధాన్యత మా ప్రభుత్వానికి అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ప్రభుత్వము అందిస్తుంది. రాష్ట్రంలో ఆయకట్టు పరిధి పెంచాం. విత్తనాలు నాన్యమైనవి అందిస్తున్నాం. ఎరువులు సకాలంలో అందించాం, దేశంలోనే రెండో ఎక్కువ వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. దీనికి వ్యవసాయ అదికారుల కృషి కారణం. రైతులకు కళ్లాలు కడితే తిరిగి డబ్బులు యివ్వమని అడిగే పార్టీ, రైతుల గురించి మాట్లాడుతుంది. రైతుల మోటార్లకు మీటర్లు మేం పెట్టము అని చెబితే కేంద్రము రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు యివ్వడం లేదు. రాష్ట్ర వ్యవసాయ వృద్ది రేటు 8శాతం కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం. దీనికి వ్యవసాయ అదికారులు కారణం. బీజేపీ నాయకులు బడా వ్యాపరులకు 11లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయించారు. రైతులకు రూపాయి మాఫీ చేయలేదు. సాగు నీటి, వ్యవసాయ రంగం, విద్యుత్తు రంగాల పై రాష్ట్ర ప్రభుత్వము ఎక్కువగా డబ్బులు కేటాయిస్తుంది.
Also Read : Satish Shah: “వీళ్లు ఫస్ట్ క్లాస్ టికెట్ ఎలా కొన్నారు.?”.. బ్రిటన్ అధికారి దిమ్మతిరిగే రిఫ్లై ఇచ్చిన బాలీవుడ్ నటుడు
సీఎం కేసిఆర్ ఉన్నంత కాలం వ్యవసాయ శాఖకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది’ అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ గ్లామర్ గా మారింది. వ్యవసాయ శాఖలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాo. ఆర్థిక పరమైన సమస్యలు సీఎం కేసీఆర్ తో మాట్లాడతా. ప్రమోషన్స్ విషయంలో తొందరలో నిర్ణయం తీసుకుంటాం. వ్యవసాయ శాఖలో క్లస్టర్స్ రేషనలైజేషన్ చేస్తాం. పెరిగే జనాబా ఆహార అవసరాలను చూస్తుంటే యిప్పుడు ఉన్న వ్యవసాయానికి పనికి రాదని నిపుణులు అంటున్నారు. భూమి సారాన్ని కాపాడుకోవటానికి అదికారులు కృషి చేయాలి. ఒకప్పుడు ప్రాధాన్యత లేని శాఖగా ఉండేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ శాఖకు మొదటి ప్రాధాన్యత ప్రభుత్వము ఇస్తుంది.
Also Read : Bengaluru: బెంగళూర్‌లో భయానక ఘటన..రైల్వే స్టేషన్‌లో డ్రమ్ములో కుళ్లిన మహిళ మృతదేహం

ఒకప్పుడు వ్యవసాయ కుటుంబం అని చెప్పుకోవటానికి యిబ్బంది పడే వారు. యిపుడు ఆ పరిస్థితి లేదు. వ్యవసాయ భూమిలో ఎక్కువ సంపాదన వచ్చే విదంగా అదికారులు కృషి చేయాలి. డిఫరెంట్ గా వ్యవసాయం చేసేలా అధికారులు రైతులకు తెలుపాలి. ఆయిల్ పామ్ ప్రోత్సహించాలి వ్యవసాయ అధికారులు. రిజల్ట్ యెక్కువగా వస్తది. చదువుకున్న పిల్లలను వ్యవసాయం వైపు మలించెలా అదికారులు కృషి చేసి, వారికి ఆదాయం ఎక్కువ వచ్చేలా చూడాలి. వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు యిప్పటికీ చేస్తాను. వ్యవసాయంలో బతుకు దెరువు వుందని యువత కు నేర్పించాలి అధికారులు. వ్యవసాయంలో ఎప్పటికీ ఉపాధి వుంటుంది. వ్యవసాయ భూమిను కాపాడు కోవడం అందరి బాధ్యత’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version