పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ తన బౌలింగ్ వేగంతో బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెడుతుంటాడు. అయితే.. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తన ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను పట్టుకున్న క్యాచ్ చూసి అభిమానులు, సహచర ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. పాకిస్తాన్ తొలి విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో ప్రత్యేకంగా నిలిచాడు.
Read Also: Karnataka : 22న కర్ణాటక బంద్.. పిలుపునిచ్చిన కన్నడ సంఘాలు
మ్యాచ్ ప్రారంభంలో హారిస్ రౌఫ్.. ఎవరూ ఊహించని విధంగా షార్ట్ ఫైన్ లెగ్ వద్ద క్యాచ్ పట్టాడు. బౌలర్ షాహీన్ షా అఫ్రిది, స్ట్రైకింగ్ ఎండ్‌లో ఫిన్ అలెన్ ఉన్నాడు. ఐదో బంతికి అలెన్ ఫ్లిక్ కొట్టిన బంతి.. షాహీన్ షా అఫ్రిది పాదాలకు తాకి షార్ట్ ఫైన్ లెగ్ వైపు వెళ్లింది. హారిస్ అక్కడే నిలబడి ఉన్నప్పటికీ.. బంతి అతని నుండి కుడి వైపుకు దూరంగా వెళ్లింది. దీంతో.. హారిస్ వెంటనే డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను పట్టుకున్నాడు. ఈ క్యాచ్ పట్టడం చూసి పాకిస్తాన్ జట్టు సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. హారిస్ కూడా ఈ క్యాచ్‌ను నమ్మలేకపోయాడు. దీంతో.. ఫిన్ అలెన్ ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 21, 2025
Read Also: Mobile Addiction: మీ పిల్లలు ఎప్పుడూ ఫోన్లతో బిజీగా ఉంటున్నారా..? ఏం చేస్తే పక్కన పెడతారు..!
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ 44 బంతుల్లో 94 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ బ్రేస్‌వెల్ 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కాగా.. 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్ 16 ఓవర్లలోనే ఛేదించింది. హసన్ నవాజ్ 45 బంతుల్లో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. తొలి వికెట్‌కు మొహమ్మద్ హారిస్‌తో కలిసి 74 పరుగులు చేశాడు. హారిస్ 20 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అనంతరం సల్మాన్ ఆఘా 31 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. దీంతో.. ఒక వికెట్ కోల్పోయి పాకిస్తా్న్ విజయం సాధించింది.