Site icon NTV Telugu

Harirama Jogaiah: జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?

Hariramajogiah

Hariramajogiah

Harirama Jogaiah: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ రాశారు. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా.. జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ వ్యాఖ్యానించారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్‌ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారంటూ ప్రశ్నలు కురిపించారు. జనసైనికులు సంతృప్తి చెందేలా సీట్ల పంపకం ఉందా?.. జనసైనికులకు కావలసింది ఎమ్మెల్యే సీట్లు కాదు.. పవన్‌ పరిపాలన అధికారం చేపట్టడమని ఆయన వెల్లడించారు. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, చెరిసగం మంత్రిపదవులు దక్కాలి.. అలా ప్రకటన వస్తేనే ఓట్ల సంక్షోభానికి మాత్ర హరిరామ జోగయ్య లేఖలో వెల్లడించారు.

Read Also: Chandrababu : తొలి విడత ప్రకటించిన అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

మాజీ మంత్రి హరిరామ జగయ్య పవన్‌కు రాసిన లేఖలో.. “ఒకరు ఇవ్వడం మరోకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా.. జనసేన 24సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా? జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా.. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా.. ఓట్ల సంక్షోభానికి ఏది తెర?.. సీట్ల పంపకం మిత్రపక్షాల మద్య ఏ ప్రాతిపదికన చేసారు.. అన్నికులాల జనాభా ప్రాతిపధికన జరిగాయా..జనసైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్లు పంపకం ఉందా?” అని లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

Exit mobile version