NTV Telugu Site icon

AP Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌కు హరిరామ జోగయ్య లేఖ.. సినిమాలు మానేయొద్దు..

Harirama Jogaiah

Harirama Jogaiah

AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నారు కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య.. పొత్తుల విషయంలో.. సీట్ల విషయంలో.. అధికారం పంచుకునే విషయంలో.. ఇలా అనేక సూచనలు చేస్తూ వచ్చారు.. అయితే, ఇప్పుడు జనసేన అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. ఫుల్‌టైం పొలిటీషియన్‌గా మారడంతో.. సినిమాలు చేస్తారా? లేదా? అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య రాజకీయ విశ్లేషణ లేఖ రాశారు.. కూటమి ఏర్పాటు ద్వారా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. మీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలల్లో పరుగులు పెట్టస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

Read Also: Virat Kohli: జస్ప్రీత్ బుమ్రా పిటిషన్‌పై నేను సంతకం చేస్తా: కోహ్లీ

ఇక, ప్రధానంగా కాపులు ఆశిస్తున్న ఐదు శాతం రిజర్వేషన్లను మీ పాలనలో అమలు చేస్తారని ఆశిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు జోగయ్య.. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కోరారు.. మీరు సినిమాలు మానేయకుండా సగం రోజులు సినిమాలకు, సగం రోజులు పరిపాలనకు కేటాయించాలనీ నా సూచన అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు.. మరోవైపు.. నిర్వీరియమైన జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలని లేఖలో సూచించారు చేగొండి హరిరామ జోగయ్య..మొన్న ఈ మధ్యే సినిమాలపై క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్.. OG, OG అంటూ ఫ్యాన్స్‌ అవరడంతో.. నవ్వూతూ స్పందించిన పవన్‌ కల్యాణ్.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలనపై దృష్టి కేటాయించామని.. ఈ సమయంలో మనం ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి సినిమా షూటింగ్ లో పాల్గొంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయన్నారు.. నన్ను నమ్మి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా నెలలో రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని పవన్‌ కల్యాణ్ స్పష్టత ఇచ్చిన విషయం విదితమే.