NTV Telugu Site icon

Pawan Kalyan: హరిహర వీరమల్లు క్లైమాక్స్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

Pawan

Pawan

ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. లేటెస్ట్ అప్ డేట్స్ తో క్యూరియాసిటీని పెంచేస్తోంది చిత్ర యూనిట్. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తున్న సినిమా కావడంతో విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. ఉగాది సందర్భంగా చిత్రబృందం పవన్‌ కల్యాణ్‌ కొత్త లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. పవర్ స్టార్ లుక్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. తాజాగా హరిహర వీరమల్లు క్లైమాక్స్ కు సంబంధించిన అప్ డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. క్లైమాక్స్ సీన్స్ ఫ్యాన్స్ కు థియేటర్లో పూనకాలే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Also Read:Poonam Gupta: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా! ఆమె ఎవరంటే..!

హరిహర వీరమల్లు క్లైమాక్స్ సీన్స్ 42 రోజుల పాటు షూట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేసిన వాటిలో లాంగ్ షూట్ ఇదేనని అంటున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ తో ఎండ్ అవదు. నవంబర్ నుంచి ఇరాన్‌లో 8 నిమిషాల పోస్ట్-క్లైమాక్స్ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నారు. ఇది ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షులు అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన సన్నివేశం అవుతుందంటున్నారు.

Also Read:Waqf Amendment Bill: 22 మంది సభ్యులు ఉన్న వక్ఫ్‌ బోర్డులో 10 మంది మాత్రమే ముస్లింలు?

ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, గ్లింప్స్, “మాట వినాలి”, “కొల్లగొట్టినాదిరో” అనే రెండు సింగిల్స్ ఫ్యాన్స్‌ ను ఆకట్టుకున్నాయి. మూడో సాంగ్ కు కూడా డేట్ లాక్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ. దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మే 9న ఫస్ట్ ఫార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.