Hari Hara Veera Mallu: జులై 24న ప్రపంచాయ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాటినించిన సినిమా హరిహర వీరమల్లు. అనేకమార్లు సినిమా షూటింగ్ ఆలస్యం నేపథ్యంలో విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. మొత్తానికి అన్ని అడ్డంకులను దాటుకొని సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నిర్మాత మీడియా మిత్రులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన సినిమాకు సంబంధించిన అనేక విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ..
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ పెంపుకు పచ్చజెండా?
ఏ రోజు ఈ సినిమా ఎందుకు చేశానా అనిపించలేదు.. కానీ, రెండు మూడు రోజుల నుంచి ఈ సినిమా విషయంలో అలా అనిపిస్తుందని అన్నారు. చాలా ఫ్యాషన్ గా సినిమా చేస్తాం, సినిమా టికెట్ రేట్ ల గురించి కూడా మాట్లాడుతున్నారు. డిస్ట్రిబ్యూషన్ లో ఈ సినిమా నాకు తక్కువ దొరుకుతుందా..? నీకు తక్కువ దొరుకుతుందా..? అనే చూస్తారు. ఎందుకంటే ఇది బిజినెస్. అసలు ఈ సినిమా ఎలా రిలీజ్ చేస్తాడు..? అసలు రిలీజ్ అవుతుందా..? అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ సినిమా విషయంలో చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నాను. నాకు డబ్బులే కావాలనుకుంటే మా సినిమా ‘వేదాళం’ రీమిక్స్ కళ్యాణ్ గారితో చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు.. లేదా ఆయనతోనే రెండు మూడు కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు.
Mohammad Azharuddin: మాజీ క్రికెటర్ భార్య బంగ్లాలో దొంగతనం.. నగదు, టీవీతో దొంగలు పరార్..!
ఎంతో ఫ్యాషన్ తో సినిమా చేస్తుంటే.. సినిమాకి బస్ లేదు, ఇది పాత పడిపోయింది, అసలు ఇది రాదు.. ఈ సినిమాని పక్కన పడేశారని కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటికీ నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా…? అని అడిగితే రకరకాల టార్గెట్స్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. రిలీజ్ కి ముందు కూడా టార్గెట్ చేస్తున్నారు. అసలు టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎవరు చేస్తున్నారో అయితే నాకు తెలియదు. పొలిటికల్ గా టార్గెట్ చేస్తున్నారా..? సినిమా పరంగా టార్గెట్ చేస్తున్నారా అనేది కూడా నాకు తెలియదు. ఒక్కోసారి టార్గెట్ అని కూడా అనలే ఎవరెవరు ఉద్దేశాలు వారికి ఉన్నాయని నిర్మాత రత్నం అన్నారు.