ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. హర్దోయ్ జిల్లా డీచ్‌చోర్ అంత్వా గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 60 ఏళ్ల సర్వధర్ తన సొంత కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు.
సర్వధర్ కుమారుడు అంకిత్ మాదకద్రవ్యాలకు బానిసై ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. అతను తాగి వచ్చి తన తల్లి రమాదేవిని కొడుతుండేవాడని గ్రామస్థులు తెలిపారు. భార్యను కొడుతుండగా తండ్రి సర్వధర్ అడ్డుపడ్డాడని.. అంకిత్ డ్రగ్స్ కు బానిస కావడంతో.. తండ్రిపై దాడి చేశాడు. పదే పదే కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికిక్కడే చనిపోయాడు. సంఘటన అనంతరం అంకిత్ తన తండ్రి మృతదేహం దగ్గర కూర్చుని ఏడ్వడం ప్రారంభించాడు. మద్యం మత్తులో ఏలాంటి పని చేశానో అతడికి అర్థం కాలేదు.
అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. నిందితుడు అంకిత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులంతా ఆందోళనకు గురయ్యారు. సర్వధర్ కష్టపడి పనిచేసేవాడు , ప్రశాంతమైన వ్యక్తి అని, కానీ కొడుకు మాదకద్రవ్యాలకు బానిస కావడం వల్ల మొత్తం కుటుంబం నాశనం అయిందని వారు అంటున్నారు.