Site icon NTV Telugu

Hardik Patel: ఐదేళ్ల నాటి కేసులో హార్దిక్ పటేల్ నిర్దోషి.. తీర్పు ఇచ్చిన కోర్టు

Hardik Patel

Hardik Patel

Hardik Patel: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న హార్దిక్ పటేల్ కు కోర్టులో ఊరట లభించింది. తన మీద నమోదు అయిన కేసులో కోర్టు నిర్దోషిగా తేల్చింది. అధికారులు నిర్దేశించిన షరతులను ఉల్లంఘించి ఒక సభలో రాజకీయ ప్రసంగం చేశారన్న ఆరోపణలపై ఐదేళ్ల క్రితం హార్దిక్ పటేల్ పై కేసు నమోదైంది. భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ సందర్బంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో హార్దిక్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రిజర్వేషన్ల కోసం ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోరాదని, అవసరం అయితే పోలీసులను చంపాలని పిలుపునిచ్చాడు.

Read Also: Blink It: బ్లింకిట్ నిర్వాకం.. బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక ప్రత్యక్షం

ఈ కేసులో శుక్రవారం తుది విచారణ విన్న జామ్‌నగర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. వాదనల అనంతరం హార్దిక్‭ను నిర్ధోషిగా ప్రకటించింది. ఈయనతో పాటు మనీష్ నందానీ, అంకిత్ ఘడియాలకు కూడా అన్ని కేసుల నుంచి విముక్తి లభించింది. ప్రాసిక్యూషన్ ఎటువంటి సందేహం లేకుండా తన కేసును నిర్ధారించడంలో విఫలమైందని, ఇప్పుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఫిర్యాదుదారుకు కూడా అన్ని వివరాలు తెలియవని తీర్పులో కోర్టు పేర్కొంది.

Read Also:Vande Bharat Train : వందేభారత్‌ రైలుపై మరోసారి రాళ్ల దాడి

ఇక గత అసెంబ్లీ ఎన్నికల (2017) సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హార్దిక్ పటేల్.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కమల తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం బీజేపీ టికెట్ మీద అహ్మదాబాద్‌లోని విరామ్‌గామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

Exit mobile version