Team India Capitan: వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. అదే విధంగా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీలో పాండ్యానే భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో అయితే గత కొన్ని సిరీస్‌ల నుంచి నాయకత్వం వహిస్తున్న హార్దిక్.. జట్టును విజయ పథంలో తీసుకెళ్తున్నాడు.
Read Also : Adipurush: నీ నామస్మరణ మహిమాన్వితం రామా…
Also Read
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా విజయవంతమయ్యాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత వైట్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మను తప్పించి టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమించాలని ఇప్పటికే బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌ను కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు భారత క్రికెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Read Also : House Lifting: హైదరాబాద్‌లో పక్కకు ఒరిగిన బిల్డింగ్.. కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశం
కాగా.. రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు చేపట్టాక… వరుసగా ఆసియాకప్, టీ20 ప్రపంచకప్-2022, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పించి మరోక ఆటగాడికి జట్టు బాధ్యతలు అప్పజెప్పాలని చాలా మంది మాజీలు బీసీసీఐకి సూచిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి కూడా తన అభిప్రాయాలను వెల్లడించాడు.
Read Also : Russia: రష్యాలో కొత్త కాదు.. వాగ్నర్‌కు ముందు రెండు అతిపెద్ద తిరుగుబాట్లు..
వన్డే ప్రపంచకప్ తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యా చేపట్టాలని తాను భావిస్తున్నాను అని రవిశాస్త్రి అన్నాడు. ప్రపంచకప్‌లో మాత్రం భారత్ జట్టుకు రోహిత్ శర్మనే నాయకత్వం వహించాలి.. రోహిత్ కూడా అద్భుతమైన లీడర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ మూడు ఫార్మాట్‌లలో జట్టును నడిపించడం అంత ఈజీ కాదు అన్నాడు. ఒత్తడి ఎక్కువగా ఉంటుంది. అది అతడి వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపిస్తోంది అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!