Site icon NTV Telugu

Team India Capitan: వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే..?

Team India

Team India

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కొనసాగుతున్నాడు. అదే విధంగా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హజరీలో పాండ్యానే భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. టీ20ల్లో అయితే గత కొన్ని సిరీస్‌ల నుంచి నాయకత్వం వహిస్తున్న హార్దిక్‌.. జట్టును విజయ పథంలో తీసుకెళ్తున్నాడు.

Read Also : Adipurush: నీ నామస్మరణ మహిమాన్వితం రామా…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా విజయవంతమయ్యాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ తర్వాత వైట్‌బాల్‌ క్రికెట్‌లో రోహిత్‌ శర్మను తప్పించి టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమించాలని ఇప్పటికే బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్‌ను కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు భారత క్రికెట్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Read Also : House Lifting: హైదరాబాద్‌లో పక్కకు ఒరిగిన బిల్డింగ్.. కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశం

కాగా.. రోహిత్‌ శర్మ భారత జట్టు పగ్గాలు చేపట్టాక… వరుసగా ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌-2022, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ఓటములను చవిచూసింది. ఈ క్రమంలో రోహిత్‌ను తప్పించి మరోక ఆటగాడికి జట్టు బాధ్యతలు అప్పజెప్పాలని చాలా మంది మాజీలు బీసీసీఐకి సూచిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత దిగ్గజ క్రికెటర్‌ రవిశాస్త్రి కూడా తన అభిప్రాయాలను వెల్లడించాడు.

Read Also : Russia: రష్యాలో కొత్త కాదు.. వాగ్నర్‌కు ముందు రెండు అతిపెద్ద తిరుగుబాట్లు..

వన్డే ప్రపంచకప్‌ తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్‌ పాండ్యా చేపట్టాలని తాను భావిస్తున్నాను అని రవిశాస్త్రి అన్నాడు. ప్రపంచకప్‌లో మాత్రం భారత్‌ జట్టుకు రోహిత్ శర్మనే నాయకత్వం వహించాలి.. రోహిత్‌ కూడా అద్భుతమైన లీడర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ మూడు ఫార్మాట్‌లలో జట్టును నడిపించడం అంత ఈజీ కాదు అన్నాడు. ఒత్తడి ఎక్కువగా ఉంటుంది. అది అతడి వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపిస్తోంది అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Exit mobile version